Telugu Gateway
Cinema

ట్రెండింగ్ లో 'క‌ళావ‌తి' సాంగ్

ట్రెండింగ్ లో క‌ళావ‌తి సాంగ్
X

స‌ర్కారు వారి పాట సినిమా నుంచి ఆదివారం నాడు విడుద‌లైన క‌ళావ‌తి సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో న‌డుస్తోంది. అత్యంత వేగంగా 12 మిలియ‌న్ల వ్యూస్ సాధించి నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మ‌హ‌ష్ బాబు, కీర్తి సురేష్ లు జంట‌గా న‌టిస్తున్నారు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. వాస్త‌వానికి ఈ పాట ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా సోమ‌వారం నాడు విడుద‌ల కావాల్సి ఉంది. అయితే ఆన్ లైన్ లో పాట లీక్ కావ‌టంతో ఆదివారం నాడే పాట విడుద‌ల చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమా మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Next Story
Share it