Telugu Gateway
Cinema

మెహందీ ఫోటోలు షేర్ చేసిన కాజల్

మెహందీ ఫోటోలు షేర్ చేసిన కాజల్
X

టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ కాజల్ పెళ్లి పనులు ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ భామ తన పెళ్లి అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె మెహందీ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లి చేసుకోనున్నారు. ముంబయ్ లో అక్టోబర్ 30న పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. ఎంపిక చేసిన పరిమిత అతిథులతో ఈ కార్యక్రమం సాగనుంది. గౌతమ్ ఇంటీరియర్ డిజైన్ స్టూడియో వ్యవస్థాపకుడు.

Next Story
Share it