Telugu Gateway
Cinema

సత్యభామ విడుదల మళ్ళీ మారింది

సత్యభామ విడుదల మళ్ళీ మారింది
X

టాలీవుడ్ ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ ఎక్కువగా గ్లామరస్ హీరోయిన్ గానే తెలుసు. కాజల్ నటించిన సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడో పదిహేడు సంవత్సరాల క్రితం లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పటికీ వరస పెట్టి ఛాన్సులు దక్కించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 7 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

వాస్తవానికి ఈ సినిమా మే 25 న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో కాజల్ తో పాటు నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ యాక్షన్ మూవీ లో కాజల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటారో చూడాలి.గత ఏడాది విడుదల అయిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ బాలకృష్ణ తో కలిసి నటించిన విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా భారతీయుడు 2 లో కూడా కాజల్ నటిస్తోంది.

Next Story
Share it