Telugu Gateway
Cinema

ఆచార్య సెట్ లో 'కాజల్ పెళ్ళి సందడి'

ఆచార్య సెట్ లో కాజల్ పెళ్ళి సందడి
X

కాజల్ అగర్వాల్. ఈ మధ్యే పెళ్ళి చేసుకుని మాల్దీవుల్లో హానీమూన్ ముగించుకుని సెట్స్ మీదకు వచ్చేసింది. వస్తూ వస్తూ తన భర్తను కూడా షూటింగ్ కు తీసుకొచ్చింది. అంతే ఆచార్య చిత్ర యూనిట్ మరోసారి కాజల్ కు పెళ్లి సందడి చూపించారు. దండలు తెప్పించి ఇద్దరితో మార్పించటంతోపాటు..కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ నిర్వహించారు. కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.

కరోనా కారణంగా తక్కువ మంది అతిథులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. కాజల్ మంగళవారం నాడు `ఆచార్య` షూటింగ్‌కు హాజరైంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్‌లో చిరంజీవి, కాజల్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటోంది. కాజల్ భర్త గౌతమ్ తాజాగా `ఆచార్య` సెట్‌కు వచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. మాల్దీవుల పర్యటన సందర్భంగా కాజల్ అగర్వాల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు పెద్ద వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

Next Story
Share it