Telugu Gateway
Cinema

దుల్కర్ మరో హిట్ కొట్టాడా?!

దుల్కర్ మరో  హిట్ కొట్టాడా?!
X

విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరస విజయాలతో దూసుకెళుతున్న హీరో దుల్కర్ సల్మాన్. సముధ్రఖని, దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా, భాగ్య శ్రీ బోర్సే లు కీలక పాత్రల్లో నటించిన సినిమానే కాంత. ఒక సినిమా తెర ముందుకు రావాలంటే తెర వెనక ఎన్నో సంఘటనలు, సంఘర్షణలు చోటు చేసుకుంటాయి. సినిమా పరిశ్రమలో ఇగో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రతిఒక్కరికి తెలిసిందే. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో వీటిని జోక్స్ గా కూడా వాడేశారు. టాలీవుడ్ లో కూడా హీరో లు ఒక రేంజ్ కు వెళ్లిన తర్వాత కథలో వేలు పెట్టి...దర్శకుడికి కూడా పాఠాలు చెప్పే పరిస్థితి వెళతారు. దర్శకుడు రోల్ లో వీళ్ళ జోక్యం వల్ల కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫట్ అన్న ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నట్లు ప్రచారం ఉంది. ఇప్పుడు ఈ ట్రెండ్ మరీ పెరిగిపోతోంది. ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే చాలు హీరో నే అన్ని చేసేయాలనే కోణంలో వెళ్లి దారుణ ఫలితాలు చవి చూసిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఇలాంటి కథే కాంత మూవీ. ఒక సినిమాను తెరకెక్కించే విషయంలో దర్శకుడు, హీరో మధ్య వచ్చే సంఘర్షణ ను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ సక్సెస్ అయ్యారు అనే చెప్పొచ్చు. అనాథగా ఉన్న ఒక వ్యక్తిని పరిశ్రమకు తీసుకొచ్చి టాప్ హీరోగా నిలబెడితే ఆ హీరో ఆ తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడితో ఎలా వ్యవహరించాడు. ఆ హీరో పై కసి పెంచుకున్న దర్శకుడు ఏమి చేశాడు. తన తల్లి కథ తో శాంత సినిమా చేయాలని ఆ దర్శకుడు అనుకుంటే క్లైమాక్స్ మారిస్తే తప్ప సినిమా చేయనని హీరో పెట్టిన షరతులు..సినిమా పేరును కూడా శాంత కాదు కాంత గా ఎందుకు మార్చారు అన్నదే ఈ మూవీ. దర్శకుడి పాత్రలో సముద్రఖని తన నటనతో అదరగొడితే...హీరో గా దుల్కర్ సల్మాన్ జీవించాడు. భాగ్య శ్రీ బోర్సే కు తొలి సారి ఈ సినిమా ద్వారా తన నటన చూపించే ఛాన్స్ దక్కింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సాగే సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ మూవీ అంతా చాలా వరకు గ్రిప్పింగ్ గా ఉంటుంది.

అయితే సెకండ్ హాఫ్ మాత్రం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. కథలో సీరియస్ నెస్ కూడా తగ్గుతుంది.ఈ సినిమాలోని హీరోయిన్ హత్య కు గురవుతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ కేసు విచారణ చుట్టూనే తిరుగుతుంది. రానా ఎంట్రీ కూడా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఉండే ట్విస్ట్ లు...క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమా అంతా కూడా నాలుగు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మహదేవన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకున్నాడు. అయ్య పాత్రలో సముధ్రఖని యాక్షన్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది. భాగ్య శ్రీ బోర్సే కి ఈ సినిమా లో తన నటన ను ప్రూవ్ చేసుకునే పాత్ర దొరికింది. అయితే రెగ్యులర్ ఎంటర్ టైన్మెంట్ కోణం లో చూస్తే కాంత మూవీ ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. సినిమా నిర్మాణంలో జరిగిన వ్యవహారాలు..ఇగో లు ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి ...దుల్కర్, సముధ్రఖని వంటి నటుల పాత్రను ప్రేమిస్తే సినిమా నచ్చుతుంది. ఇది ఒక కొత్త తరహా ప్రయోగం గా చెప్పొచ్చు.

రేటింగ్: 2 .75 -5

Next Story
Share it