Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్

ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్
X

కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో ప్రముఖ హీరో ఎన్టీఆర్ ముందుంటారు. తొలి దశ కరోనా సమయంలో..తాజాగా కూడా ఆయన ప్రజలకు కరోనా జాగ్రత్తలు చెబుతూ వీడియోలు విడుదల చేశారు. ఓ వైపు కరోనా జాగ్రత్తలు చెబుతూనే వెసులుబాటును బట్టి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ తోపాటు ఆర్ఆర్ఆర్ టీమ్ అందరూ కూడా కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

సోమవారం ట్వీట్‌ చేసిన ఎన్టీఆర్‌.. 'నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను నా కుటుంబం ఐసోలేషన్‌లో ఉన్నాం. అన్ని కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాము. గత కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారంతా కోవిడ్‌ పరీక్షలు చేసుకొవాల్సిందిగా అభ్యర్థిస్తున్నా' అని కోరారు. ఆర్ఆర్ఆర్ బృందంలో దర్శకుడు రాజమౌళి మొదలుకుని మరో హీరో రామ్ చరణ్, హీరోయిన్ అలియాభట్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు.

Next Story
Share it