అధికారికంగా వెల్లడించిన ఆఫీస్

డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ భుజానికి కొద్ది రోజుల క్రితం గాయం అయిన సంగతి తెలిసిందే. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుంటే ఇది సెట్ అవుతుంది అని ప్రకటించారు తొలుత. కానీ ఇప్పుడు సడన్ గా డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌లోని 'కిమ్స్' ఆస్పత్రిలో ఎన్టీఆర్ భుజానికి వైద్యులు బుదవారం నాడు శస్త్రచికిత్స చేయనున్నట్లు ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. వైద్యుల బృందం ఆయన త్వరగా, పూర్తి ఆరోగ్యంతో కోలుకునేలా చికిత్స అందిస్తోంది అని తెలిపారు.
శస్త్రచికిత్స తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తాం అని ఇందులో వెల్లడించారు. తాజా పరిణామాలతో ముందు ప్రకటించినట్లు కాకుండా ఎన్టీఆర్ శస్త్రచికిత్స తర్వాత ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది అని చెపుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'డ్రాగన్' లో నటిస్తున్నారు.



