Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ కారు ఫ్యాన్సీ నెంబ‌ర్ ధ‌ర 17 ల‌క్షల రూపాయ‌లు

ఎన్టీఆర్ కారు ఫ్యాన్సీ నెంబ‌ర్ ధ‌ర 17 ల‌క్షల రూపాయ‌లు
X

సెల‌బ్రిటీల‌కు, సంప‌న్నుల‌కు ఫ్యాన్సీ నెంబ‌ర్ల‌పై ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాము కోరుకున్న నెంబ‌ర్ల కోసం ఎంత ధ‌ర అయినా చెల్లించ‌టానికి వీరు వెన‌కాడ‌రు. తాజాగా ఈ విష‌యం మ‌రోసారి నిరూపిత‌మైంది. న‌చ్చిన కారు నెంబ‌ర్ కోసం ల‌క్షల‌కు ల‌క్షలు వెచ్చించారు. ఆ నెంబ‌ర్ కు పెట్టిన డ‌బ్బుల‌కే ఓ రేంజ్ మ‌ధ్య‌త‌ర‌హా కాస్ట్లీ కారు వ‌స్తుంది. టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ హీరో ఎన్టీఆర్ త‌న కొత్త కారుకు వేలంలో టీఎస్09 ఎఫ్ఎస్9999 ఫ్యాన్సీ నెంబ‌ర్ ను ద‌క్కించుకున్నారు.

దీని కోసం ఆయ‌న చెల్లించిన మొత్తం 17 ల‌క్షల రూపాయ‌లు. ఫ్యాన్సీ నెంబ‌ర్ల వేలం ద్వారా ర‌వాణా శాఖ తాజాగా 45.43 ల‌క్షల రూపాయ‌లు సంపాదించింది. ల‌హ‌రి ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ సంస్థ త‌మ కారు కోసం ఏడు ల‌క్షల రూపాయ‌ల‌తో ఫ్యాన్సీ నెంబ‌ర్ ను ద‌క్కించుకుంది. ఈ సంస్థ టీఎస్ 09 ఎఫ్ టి 0001 నెంబ‌ర్ పొందింది. టీఎస్09 ఎఫ్‌టి 0009 నెంబ‌ర్ ను ర‌త‌న్ న‌ల్లా అనే వ్య‌క్తి 3,75,999 రూపాయ‌ల‌తో ద‌క్కించుకున్నారు.

Next Story
Share it