Telugu Gateway
Cinema

అభిమానులకు ఎన్టీఆర్ లేఖ

అభిమానులకు ఎన్టీఆర్ లేఖ
X

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కరోనా సోకి విశ్రాంతి తీసుకున్నారు. అయితే ఆయన కరోనా నుంచి వేగంగానే కోలుకుంటున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కరోనా సమస్య ఓ వైపు..మరో వైపు లాక్ డౌన్లు..కర్ఫ్యులు అమల్లో ఉన్నాయి. ఈ అంశాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ హీరో తన అభిమానుల కోసం ఓ ఓ లేఖ విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను.

త్వరలో పూర్తిగా కోలుకుని కరోనాను జయిస్తాను. ప్రతి ఏటా మీరు నా పుట్టినరోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే నాకు మీరందించే అతి పెద్ద కానుక" అని పేర్కొన్నారు. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదని..దేశమంతా కరోనాతో యుద్ధం చేస్తోందని అన్నారు. ఎంతో మంది తమ ప్రాణాలును..జీవనోపాధిని కోల్పోయారని.. కుదిరితే ఆ కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Next Story
Share it