Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ లుక్ అదిరింది

ఎన్టీఆర్ లుక్ అదిరింది
X

ఆస్కార్ అవార్డు ల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయన కాలిఫోర్నియా లోని బెవర్లీ హిల్స్ తాను స్టే చేసిన ప్లేస్ ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ లుక్ అదిరింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అమెరికాలో ఆస్కార్ అవార్డు ల కార్యక్రమం తో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్ సిఏ) నుంచి అవార్డు అందుకోనున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ 30 పూజ కార్యక్రమం తో పాటు షూటింగ్ కూడా ఈ నెలలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం చిత్ర యూనిట్ సోమవారం నాడు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా లో ఉన్న ఆర్ఆర్ఆర్ టీం రామ్ చరణ్ తో పాటు దర్శకుడు రాజమౌళి, కీరవాణి బృందంతో ఎన్టీఆర్ జతకలవనున్నారు. అదే సమయంలో చిత్ర యూనిట్ మాత్రం తమ నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్స్ విభాగంలో అవార్డు వస్తుంది అనే ధీమాతో ఉంది. ఈ విషయం తేలటానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది.

Next Story
Share it