మూడు నెలల వరకు విశ్రాంతిలోనే!

హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ గురువారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు బుధవారం నాడు కిమ్స్ లో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి అయింది. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ భుజానికి గాయం అయిన సంగతి తెలిసిందే. తొలుత కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుంటే ఇది సెట్ అవుతుంది అని భావించారు కానీ గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది అని తేల్చారు. దీంతో ఆయన వెంటనే కిమ్స్ లో చేరటం..నిపుణుల బృందంతో కూడా డాక్టర్లు ఆయనకు శస్త్రచికిత్స కూడా పూర్తి అయింది.



