దేవర సందడి షురూ
ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలుగా రానున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ఇప్పటికే వచ్చిన లుక్స్ తో వెల్లడవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఇదే కావటంతో ఆయన ఫ్యాన్స్ దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ ఐదున విడుదల కావాల్సి ఉండగా..తర్వాత విడుదల తేదీని మార్చారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ఇక నుంచి వరస పెట్టి అప్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు.