Telugu Gateway
Cinema

రాజ్ నాథ్ సింగ్ తో జ‌న‌గ‌ణ‌మ‌న టీమ్ భేటీ

రాజ్ నాథ్ సింగ్ తో జ‌న‌గ‌ణ‌మ‌న టీమ్ భేటీ
X

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ లు గురువారం నాడు ఢిల్లీలో కేంద్ర ర‌క్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో స‌మావేశం అయ్యారు. ఇటీవ‌లే పూరీ, విజ‌య్ ల కాంబినేష‌న్ లో జ‌న‌గ‌ణ‌మ‌న (JGM) కొత్త సినిమాను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రో ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ఈ సినిమా నిర్మాతల్లో ఒక‌రుగా ఉన్నారు. మ‌రో నిర్మాత ఛార్మి కౌర్. ఇటీవ‌లే చిత్ర యూనిట్ టైటిల్ తో కూడిన ఫ‌స్ట్ లుక్ ను కూడా విడుద‌ల చేసి అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ఓ వైపు పూరీ, విజ‌య్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన లైగ‌ర్ సినిమా విడుద‌ల కాక‌పోతే కొత్త ప్రాజెక్టు ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాను హీరో మ‌హేష్ బాబుతో చేయ‌నున్న‌ట్లు పూరీ జ‌గ‌న్నాథ్ తొలుత ప్ర‌క‌టించారు. కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోవ‌టంతో ఇప్పుడు విజ‌య్ తో దీన్ని ప‌ట్టాలెక్కిస్తున్నారు.

Next Story
Share it