ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ లో 'జాతిరత్నాలు'
BY Admin7 April 2021 11:22 AM GMT
X
Admin7 April 2021 11:22 AM GMT
జాతిరత్నాలు. టాలీవుడ్ లో ఈ సినిమా సాధించిన సక్సెస్ అంతా ఇంతా కాదు. కరోనా తొలి దశ తర్వాత యూఎస్ మార్కెట్లోనూ అత్యధిక వసూళ్ళు సాధించి కొత్త రికార్డులు సృష్టించింది ఈ సినిమా. కామెడీ ప్రేక్షకులు ఇక ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు జాతిరత్నాలు సినిమా చూసి నవ్వుకోవచ్చు. అయితే దీనికి 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీ ఖాతా ఉండాల్సిందే.
ఏప్రిల్ 11 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని అమెజాన్ బుధవారం నాడు అధికారికంగా వెల్లడించింది. డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమా ద్వారా ప్రజలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో సక్సెస్ సాధించాడు. మార్చి 11న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాల నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Next Story