చంచల్ గూడ జైలులో బెస్ట్ బ్యాచ్ మాదే
జాతిరత్నాలు సినిమా థియేట్రికల్ ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదల అయింది. ఈ ట్రైలర్ కూడా ఫుల్ కామెడీతో నవ్వించారు నవీన్ పోలిశెట్టి అండ్ టీమ్. 'టెన్త్ లో సిక్స్టీ పర్సంట్. ఇంటర్ లో ఫిఫ్టీ పర్సంట్, బీటెక్ లో ఫార్టీ పర్సంట్. ఏందిరా ఇది.' అందుకే ఎంటెక్ చేయలేదన్నా అంటూ నవీన్ పోలిశెట్టి కటింగ్. మరీ గలీజుగా లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అని పిలుస్తారు అన్నా...వంటి ఎన్నో సరదా సరదా డైలాగ్ లతో సాగిపోయింటి ట్రైలర్. ఓ పార్టీలో నవీన్ పోలిశెట్టి ఎనీ డ్రింక్ సర్ అని అడిగితే..ఫ్రెంచ్ వైన్ అని అడుగుతాడు.
ఫ్రెంచ్ వైన్ విత్ సర్..అంటే ప్రెంచ్ వైన్ విత్...ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అంటూ చెప్పటంతో పక్కన ఉన్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పడీ పడీ నవ్వుతుంది. 'ఈ మొత్తం చంచల్ గూడ జైలులో బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా. 2008 బ్యాచ్' అని వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్...ట్రైలర్ చివరిలో కోర్టులో సీన్ లో బ్రహ్మనందం, నవీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలిచారు. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మిస్తుండగా...అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.