Telugu Gateway
Cinema

టాలీవుడ్ లో వరస ఛాన్స్ లు

టాలీవుడ్ లో వరస ఛాన్స్ లు
X

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలన్న శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ కోరిక కాస్త ఆలస్యంగానే నెరవేరింది. అయినా సరే ఎంట్రీ అదిరిపోయే సినిమాతో కుదిరింది. తెలుగు లో జాన్వి కపూర్ చేస్తున్న తొలి సినిమా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ఓకే అయింది. అది హీరో రామ్ చరణ్ తో.

అంటే ఇద్దరు ఆర్ఆర్ఆర్ హీరోలతో జాన్వి కపూర్ వరస సినిమాలు చేస్తున్నట్లు అయింది. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలన విజయం దక్కించుకుందో తెలిసిందే. దీంతో ఇప్పుడు వాళ్ల సినిమా వారసులు రామ్ చరణ్, జాన్వి కపూర్ కాంబినేషన్ సినిమా అంటే దీనిపై సహజంగానే అందరిలో ఆసక్తి రేపుతోంది. దర్శకుడు బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది.

Next Story
Share it