Telugu Gateway
Cinema

రెండవ సినిమాతోనే బుచ్చిబాబు సెన్సేషన్

రెండవ సినిమాతోనే బుచ్చిబాబు సెన్సేషన్
X

రామ్ చరణ్ కొత్త సినిమా స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ మెగా హీరో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన సినిమాతో సంచలన విజయం దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించనున్న సినిమా బుధవారం నాడు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. బుచ్చిబాబు తన రెండవ సినిమా నే రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో శ్రీకారం చుట్టడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ కపూర్ టాలీవుడ్ లో చేస్తున్న రెండవ సినిమా ఇది. ఇప్పటికే జాన్వీ కపూర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా లో ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it