Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వీ కపూరే

ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వీ కపూరే
X

ఎన్టీఆర్ ఫాన్స్ కు ఒకే రోజు రెండు వార్తలు. ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ సోమవారం ఉదయం అమెరికా బయలు దేరి వెళ్లారు. ఆస్కార్ అవార్డు ల ప్రకటన కంటే ముందు ఈ హీరో పలు ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. అదే సమయంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కూడా అందుకుంటారు. ఇది అలా ఉంటే ఎన్టీఆర్ 30 వ సినిమా కు సంబంధించి చిత్ర యూనిట్ సోమవారం నాడు కీలక ప్రకటన చేసింది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించనున్నారు. జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె పోస్టర్ మాత్రం విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ నుండి తిరిగి వచ్చాక మార్చ్ 18 న సినిమా పూజా కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ 30 పోస్టర్ లో అచ్చమయిన తెలుగు అమ్మాయిలా కనిపించింది.

ఈ సినిమా సముద్రం నేపధ్యం లో ఉంటోంది కాబట్టి, జాన్వీ కపూర్ పోస్టర్ వెనక సముద్రాన్ని చూపించారు.జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కి సంబంధించి చాలా చాలా వార్తలు వచ్చాయి. కానీ అవేమి వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ తో కలిసి జాన్వీ సందడి చేయనుంది. తాజా ప్రకటనతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. ఎందుకంటే జాన్వీ కపూర్ కు తెలుగు లో ఇది మొదటి సినిమా కావటం ఒకెత్తు...మరో వైపు దివంగత శ్రీదేవి పెద్ద ఎత్తున ఫాన్స్ ఉన్న విషయం తెలిసిందే. సహజంగా ఇది కూడా ఈ సినిమా రేంజ్ పెరగటానికి ఉపయోగపడుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఏ పాత్రలో అయినా తన నట విశ్వరూపం చూపిస్తారు. అందులో ఎవరికీ సందేహం ఉండదు. అయితే తొలిసారి జాన్వీ ఈ సినిమాతో రావటం కొంత కలిసి వచ్చే అంశంగా చెపుతున్నారు.

Next Story
Share it