అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపింది. ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డు సాధిస్తుంది అని అంతా భావించారు. కానీ ఇది మాత్రం నవంబర్ 4 నాటికి 821 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ లెక్కన జైలర్ 2 వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించటం సాధ్యం అయ్యే పని కాదు అని తేలిపోయింది. ఒక తమిళ సినిమా ఈ రికార్డు ను అందుకోవటం కోసం మరికొంత కాలం వేచిచూడక తప్పదు అని తేలిపోయింది కూడా. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా రజనీకాంత్ స్టైలిష్ యాక్షన్..ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ...అనిరుద్ మ్యూజిక్...ఎలివేషన్స్ ఈ సినిమాలో హై లైట్ గా నిలిచాయి.
బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. నవంబర్ 12 నుంచి జైలర్ 2 సినిమా తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది. దసరా సెలవులను టార్గెట్ చేసుకుని అక్టోబర్ 15 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదల అయి నెల రోజులు కాకముందే ఓటిటి లోకి వస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఎస్ జె సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జైలర్ 2 మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు నమోదు చేసింది.



