Telugu Gateway

బాబోయ్...జ‌గ‌ప‌తిబాబు

బాబోయ్...జ‌గ‌ప‌తిబాబు
X

చూస్తే భ‌య‌ప‌డాల్సిందే. అలా ఉంది మ‌రి జ‌గ‌ప‌తిబాబు లుక్. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా 'సాలార్'. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు రాజామ‌న్న‌ర్ గా క‌న్పించ‌బోతున్నారు. ఆయ‌న లుక్ ను చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు అధికారికంగా విడుద‌ల చేసింది. జ‌గ‌ప‌తిబాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన త‌ర్వాత ప‌లు సినిమాల్లో విల‌న్ గా కూడా సంద‌డి చేశారు.

గ‌త సినిమాల‌కు భిన్నంగా సాలార్ లో మాత్రం ఆయ‌న లుక్ చాలా డిఫ‌రెంట్ గా క‌న్పిస్తోంది. కెజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న సినిమాల్లో భారీత‌నం ఉండేలా చూసుకుంటారు. మ‌రి ఇప్పుడు సాలార్ ఎలా ఉండ‌బోతుందో వేచిచూడాల్సిందే. ఈ సినిమాలో ప్ర‌భాస్ కు జోడీగా శ్రుతి హాసన్ న‌టిస్తోంది.

Next Story
Share it