తాప్సీ, అనురాగ్ కశ్యప్ పై ఐటి దాడులు
BY Admin3 March 2021 8:07 AM GMT
X
Admin3 March 2021 8:07 AM GMT
ప్రముఖ హీరోయిన్ తాప్సీతోపాటు దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై ఐటి దాడులు జరుగుతున్నాయి. ముంబయ్ తోపాటు పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. పన్ను వేగవేతకు సంబంధించిన సమాచారంతోనే ఈ దాడులు చేస్తున్నట్లు చెబుతున్నా..రైతు చట్టాలకు సంబంధించి సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఆమె కూడా ట్విట్టర్ ద్వారానే ఈ అంశంపై స్పందించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే తాప్సీపై ఐటి దాడులు జరగటం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఇలా జరిగిన సంఘటనలు ఎన్నో. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై ఆ తర్వాత కొద్ది రోజులకే ఐటి దాడులు జరిగిన సందర్భాలు ఎన్నో.
Next Story