Telugu Gateway
Cinema

'ఆర్ఆర్ఆర్' విడుద‌ల వాయిదా..అధికారిక ప్ర‌క‌ట‌న‌

ఆర్ఆర్ఆర్ విడుద‌ల వాయిదా..అధికారిక  ప్ర‌క‌ట‌న‌
X

ఊహించిందే జ‌రిగింది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు హీరోలు న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. స‌రైన స‌మ‌యంలో భార‌తీయ సినిమా కీర్తి, ప్ర‌తిష్ట‌ల‌ను పెంచేలా ముందుకొస్తామ‌ని పేర్కొంది. ఏ మాత్రం విశ్ర‌మించ‌కుండా సినిమా విడుద‌లకు ప్ర‌య‌త్నం చేశామ‌ని..కానీ కొన్ని ప‌రిస్థితులు త‌మ చేతుల్లో లేకుండా పోయాయ‌ని చిత్ర యూనిట్ త‌న అధికారిక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు మూసేస్తున్నార‌ని..ఈ త‌రుణంలో అభిమానులు త‌మ ఉత్సుక‌త‌ను..ఉత్సాహన్ని మ‌రికొంత కాలం ఉంచుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అన్నారు.

ఈ సినిమాలో భాగ‌స్వాములు అయిన అంద‌రి ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని జ‌న‌వ‌రి7న విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ సోష‌ల్ మీడియా అధికారిక ఖాతా ద్వారా వెల్ల‌డించింది. ఆయా హీరోల ఫ్యాన్స్, ప్రేక్షకుల‌పై త‌మ‌పై చూపిస్తున్న ప్రేమ‌కు ధ‌న్యవాదాలు అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పుతోంది. రెగ్యుల‌ర్ క‌రోనా కేసుల సంఖ్య కూడా ఊహించ‌ని స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. దీంతో ప‌లు చిత్ర యూనిట్లు విడుద‌ల‌పై పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయి.

Next Story
Share it