Telugu Gateway
Cinema

ఇరుముడి మూవీ సెన్సార్ కంప్లీట్

ఇరుముడి మూవీ సెన్సార్ కంప్లీట్
X

హీరో రవి తేజ అంటే ఫస్ట్ గుర్తుకు వచ్చేది యాక్షన్...ఎంటర్టైన్మెంట్ సినిమాలే. ఎందుకంటే ఆయన కెరీర్ మొత్తంలో చేసింది సింహభాగం ఇలాంటి సినిమాలే కాబట్టి. గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవి తేజ ఈ సారి రూట్ మార్చాడు. ఈ ఏడాది సంక్రాంతికి రవి తేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ తో ప్రేక్షకులకు ఆకట్టుకున్నా కూడా ఇది కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు ఒక కొత్త ప్రయోగానికి సిద్ధం అయినట్లు కనిపిస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి మూవీ విడుదలకు సిద్ధం అయింది.

ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముఖ్యంగా తండ్రి, కూతురు మధ్య సాగిన డ్రామాతో ఈ మూవీ తెరకెక్కినట్లు కనిపిస్తోంది. ఇందులో రవితేజకు జోడిగా ప్రియా భవానీ శంకర్ నటించింది. సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక విజయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇరుముడి మూవీకి జీవి ప్రకాష్ సంగీతం అందించారు. ఈ 21న సినిమా తెలుగు, తమిళంలో సినిమా విడుదల కానుంది.

Next Story
Share it