ఈల వేసి..గోల చేసిన 'పుష్పరాజ్'
BY Admin7 April 2021 4:02 PM

X
Admin7 April 2021 4:02 PM
తగ్గేదే లే అంటున్నాడు అల్లు అర్జున్. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'లో ఆయన పూర్తి స్థాయి మాస్ లుక్ లో కన్పించారు. అడవిలో ఎర్రచందనం లోడ్ ఎక్కిస్తున్న తరుణంలో అటవీ అధికారుల ఎంట్రీ...వారితో ఫైటింగ్ సీన్లతో పుష్పరాజ్ పాత్ర పరిచయ వీడియోను చిత్ర యూనిట్ బుధవారం రాత్రి విడుదల చేసింది.
గురువారం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా దీన్ని విడుదల చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటించారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ మళయాళ నటుడు ఫహద్ పాజిల్ నటిస్తున్నారు.
Next Story