హీరో రామ్ కి గాయాలు
BY Admin4 Oct 2021 1:03 PM IST

X
Admin4 Oct 2021 1:03 PM IST
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో రామ్ జిమ్ లో గాయపడ్డారు. దీంతో మెడకు పట్టీవేసుకున్నారు. ఈ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. వ్యాయామం చేస్తున్న సమయంలో రామ్ ఈ గాయం అయినట్లు సమాచారం. రామ్ కు గాయం కావడంతో సినిమా షూటింగులు ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 19వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది.
Next Story