Telugu Gateway
Cinema

ఇండియా కు రెండు ఆస్కార్ అవార్డు లు

ఇండియా కు రెండు ఆస్కార్ అవార్డు లు
X

భారతీయ సినిమాకు సంబంధించి ఆస్కార్ పరంగా రెండు శుభవార్తలు. షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ఒక ఆస్కార్ అవార్డు రాగా..ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఈ అవార్డు దక్కింది. ఆర్ఆర్ఆర్ పూర్తి కమర్షియల్ సినిమా కాగా...ఎలిఫెంట్ విస్పరర్స్ ప్రకృతి ప్రేమికుల ..వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కించిన ఫిల్మ్. ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు ఆస్కార్‌ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ కార్తీకి గొంసొల్వెస్, నిర్మాత గునీత్ మోగన ఈ అవార్డు లు అందుకున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో షార్ట్ ఫిలిం కేటగిరీ లో భారత్ నుంచి ఈ డాక్యుమెంటరీ అధికారికంగా నామినేట్ అయింది. ఈ డాక్యుమెంటరీ ఓటిటి నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలిసారే దర్శకురాలు కార్తీకి గొంసొల్వెస్ ఏకంగా ఆస్కార్ కు నామినేట్ అవటం,అవార్డు కూడా సాధించటం పెద్ద సంచలనంగానే చెప్పుకోవచ్చు.

ది ఎలిఫెంట్ విస్పరర్స్ మూవీని ముదుమలై నేషనల్ పార్క్‌లో తీశారు. ఇది ఇద్దరు దంపతుల మధ్య పెరిగిన ఓ అనాధ ఏనుగుపిల్ల కథ. బొమ్మన్‌, బెల్లి దంపతులు రఘు అనే అనాథ ఏనుగు పిల్లను పెంచుకుంటారు. వీరి మధ్య ఏర్పడే బంధాన్నే కాకుండా.. వారి పరిసరాల సహజ సౌందర్యాన్ని కూడా ఇందులో చూపించారు. ఈ షార్ట్ ఫిలిం కోసం ఏకంగా 450 గంటల నిడివి గల వీడియో తీశారు. కానీ ఈ షార్ట్ ఫిలిం మాత్రం 42 నిముషాలు మాత్రమే ఉంటుంది. ప్రకృతి, జంతువులతో మనుషుల బంధం గురించే ఈ కథ సారాంశం. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ ని కూడా అందుకుంది. అడవి, ప్రకృతితో ఆ జంట అనుబంధం, ఆ ఏనుగు పిల్ల చేసే అల్లరి సినిమాలో హై లైట్ గా చెప్పుకోవచ్చు.

Next Story
Share it