డ్యాన్స్ అంటే నాకు చిరాకు..అయినా మీ కోసం చేశా
లైగర్ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరె ఏందిరా ఈ మెంటల్ మాస్...నాకు అసలు అర్ధం అవటం లేదు ఏమీ ఈ రోజు. మా అయ్య తెల్వదు..మా తాత తెల్వదు. ఎవరూ తెలవదు అసలు మీకు. రెండేళ్లు అయితుంది నా సినిమా రిలీజ్ అయి. ముందు రిలీజ్ అయిన సినిమా కూడా పెద్ద చెప్పుకునే సినిమా ఏమీ కాదు. అయినా ట్రైలర్ కు ఈ రచ్చ ఏందిరా నాయినా. మీ ప్రేమను నేను మాటల్లో చెప్పలేను. అయినా మాటల్లో ట్రై చేస్తా అంటూ లైగర్ సినిమాలో నత్తితో మాట్లాడినట్లు...ఐ లవ్ యూ..ఐ లవ్ యూ అంటూ అభిమానుల్లో హుషారెక్కించారు. అసలు ఈ సినిమా మీకు డెడికేట్ చేస్తున్నా.
ఈ సినిమాలో ఆ బాడీ చేయటం, ఫైట్లు చేయటం, డ్యాన్స్ లు.. అసలు డ్యాన్స్ అంటే నాకు చిరాకు. అసలు అంత డ్యాన్స్ చేశానంటే మా వాళ్లు గర్వంగా ఫీల్ అవ్వాలనే చేశా. ఆగస్టు 25 రోజు ఇలాంటి సెలబ్రేషన్ ప్రతి థియేటర్లో జరగాలి. థియేటర్లు నిండిపోవాలి. నేను గ్యారంటీగా చెబుతున్నా. ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతది. ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదని మీరంతా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అన్నది చూడాలి. ఆగస్టు 25న దేశంలో అగ్గి రాజేద్దాం అంటూ వ్యాఖ్యానించారు విజయ్ దేవరకొండ. ఆగస్టు 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.