Telugu Gateway
Cinema

ఆకట్టుకునేలా 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' టీజర్

ఆకట్టుకునేలా ఇచ్చట వాహనాలు నిలుపరాదు టీజర్
X

హీరో సుశాంత్ కొత్త సినిమా వచ్చి చాలా కాలమే అయింది. గత ఏడాది అల..వైకుంఠపురంలో అల్లు అర్జున్ తో కలసి నటించాడు. సుశాంత్ హీరోగా నటించిన కొత్త సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది.అదే 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేశారు. హీరో ప్రభాస్ ఈ టీజర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాలో సుశాంత్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచిందనటంలో సందేహం లేదు. కొత్త బైక్ ను నో పార్కింగ్ ప్రదేశంలో పెట్టాడని..దాన్ని ధ్వంసం చేయటం.. హెల్మెట్ పగలగొట్టే సన్నివేశాలు..కొత్త బైక్ చేతికొచ్చిన తర్వాత హీరోయిన్ ను తనను డ్రాప్ చేయమని అడిగిన సీన్లతో టీజర్ కట్ చేశారు. ఇందులో వెన్నెల కిషోర్ సందడి కూడా బాగానే ఉండేలా కన్పిస్తోంది.

Next Story
Share it