హిట్ 3 బుకింగ్స్ లో కొత్త రికార్డు

నాని హిట్ 3 సినిమా దుమ్మురేపింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా తోలి రోజు ఈ సినిమాకు 43 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇంత భారీ స్థాయిలో వసూళ్లు రావటం పెద్ద సంచలనంగానే చెప్పుకోవాలి. నాని కెరీర్ లోనే ఫస్ట్ డే ఇంత భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. ఈ సినిమాకు బజ్ ఏ రేంజ్ లో ఉందో ఓపెనింగ్ బుకింగ్స్ స్పష్టం చేశాయి. ఈ జోష్ చూస్తుంటే హిట్ 3 సినిమా వీకెండ్ పూర్తి అయ్యే లోపు వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించటం ఖాయంగా కనిపిస్తోంది. మరో వైపు ఇప్పటికే అమెరికా మార్కెట్ లోనూ వన్ మిలియన్ మార్క్ ను దాటేసి..రెండు మిలియన్ల వసూళ్ల దిశగా వెళుతోంది.
దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ ఫ్రాంచైజ్ లోని మూడవ సినిమా లో హీరో నానికి జోడిగా ..శ్రీనిధి శెట్టి నటించింది. ఇందులో నాని స్టైలిష్ లుక్ లో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో క్రిమినల్స్ కు మించిన విలనిజం చూపించారు. నటన విషయంలో ఈ సినిమాతో నాని మరో కొత్త ఎత్తుకు ఎదిగాడు అనే చెప్పాలి. మరో వైపు హిట్ 3 క్లైమాక్స్ లో హిట్ 4 మూవీ ఎవరితో ఉండబోతుందో వెల్లడించి ఈ సినిమాపై కూడా ఇప్పటి నుంచే హైప్ బిల్డ్ అప్ చేయటానికి దర్శక , నిర్మాతలు ప్రయత్నించారు అనే చెప్పొచ్చు . హిట్ 4 లో కార్తీ పోలీస్ ఆఫీసర్ గా సందడి చేయబోతున్నారు . బుక్ మై షో లో హిట్ 3 సినిమా టికెట్ బుకింగ్స్ కూడా రికార్డు సృష్టించాయి . 24 గంటల్లో ఈ సినిమాకు సంబదించిన 2.72 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. నాని కెరీర్ లో సింగల్ డే ఇంత భారీ స్థాయిలో టికెట్స్ అమ్ముడు పోవటం ఇదే ఫస్ట్ టైం .