బుల్లి తెరపై ఇక బ్లడ్ బాత్

నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ మూవీ ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. మే 29 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా మూడవ సినిమా ను నాని తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ హిట్ చిత్రాల నిర్మాత కూడా నాని నే అన్న విషయం తెలిసిందే. హిట్ 3 మూవీ లో నాని కి జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది.
ఈ సినిమాలో వయలెన్స్ మరీ ఎక్కువగా ఉంది అనే విమర్శలు వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 118 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. హిట్ సినిమా లు అన్ని కూడా కేసు లను సాల్వ్ చేసే దిశగానే సాగుతాయి అనే విషయం తెలిసిందే. హిట్ 3 లో నాని అర్జున్ సర్కారు పాత్రలో సీరియల్ కిల్లర్స్ ను ఎలా పట్టుకొంటాడు..దీనికోసం పోలీస్ అధికారిగా ఉన్న అర్జున్ సర్కారు ఆ టీం లో ఎలా చేరతాడు అన్నదే ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపిన ఈ సినిమా ఓటిటి లో కూడా రికార్డు లు నమోదు చేయటం ఖాయం అనే చెప్పొచ్చు. మే 1 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.