మీ విలాసాలు..అవినీతి కాస్త తగ్గించుకోవచ్చుగా!
ఏపీలో సినిమా టిక్కెట్ల అంశంపై ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. గురువారం నాడు హీరో నాని ఏపీలో టిక్కెట్ రేట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమకు ఏ మాత్రం మేలు చేయదన్నారు. మరో హీరో సిద్ధార్ధ తాజాగా ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ఇందులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మంత్రులు సినిమా వ్యయం తగ్గించి ప్రేక్షకులకు తక్కువ రేట్లకు సినిమా చూపిస్తామని అంటున్నారు.
తాము కూడా ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామని..ఆ డబ్బును కొంత మంది విలాసాలకు..మరికొంత మంది లక్షల కోట్లు దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి మీ విలాసాలకు తగ్గించుకుని తమకు కూడా పన్నుల్లో డిస్కౌంట్లు ఇవ్వండి అని పేర్కొన్నారు. హీరో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు వరస పెట్టి విరుచుకుపడుతున్నారు. మరి సిద్ధార్ధ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.