త్వరలో సాయిధరమ్ తేజ్ డిశ్చార్జి
రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుతం పూర్తి కోలుకున్నట్లు తెలిపిన వైద్యులు ఇంతకుముందే వెంటిలేటర్ తొలగించారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం ఇంకా మెరుగై కళ్లు తెరిచి చూస్తుండడంతో బుధవారం ఆక్సిజన్ సపోర్టు సైతం తీసేసినట్లు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు.
సొంతంగానే శ్వాస తీసుకుంటూ అందరితో మాట్లాడగలుగుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉందని సమాచారం. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిరంజీవి బుధవారం నాడు విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ల మధ్య తలెత్తే సమస్యలతో ఈ సినిమాను తెరకెక్కించారు.