కరోనా బారిన పడిన రాజశేఖర్ ఫ్యామిలీ
BY Admin17 Oct 2020 9:12 AM GMT
X
Admin17 Oct 2020 9:12 AM GMT
సీనియర్ హీరో రాజశేఖర్ ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడింది. రాజశేఖర్ తోపాటు జీవిత, వారి ఇద్దరు కూతుళ్ళు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. తనతో పాటు భార్య జీవిత, పిల్లలు శివానీ, శివాత్మికలకు కరోనా సోకిన విషయం నిజమేనని, ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్సి పొందుతున్నట్లు తెలిపారు. పిల్లలిద్దరూ పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. జీవిత, తాను మాత్రం ఇంకా వైద్యుల సంరక్షణలోనే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మా ఇద్దరి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని తెలిపారు. త్వరలోనే ఇంటికి వెళ్తామంటూ వెల్లడించారు.
Next Story