Telugu Gateway
Cinema

ఆందోళనకరంగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం

ఆందోళనకరంగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం
X

కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఆయన కుమార్తె శివాత్మిక వెల్లడించారు. రాజశేఖర్ తోపాటు జీవిత, ఇద్దరు కుమార్తెలు కోవిడ్ బారిన పడ్డా..ముగ్గురు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే రాజశేఖర్ ఆరోగ్యం మాత్రం ఆందోళనకరంగా ఉందని శివాత్మక ట్విట్టర్ లో తెలిపారు. 'నాన్న ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంది. కోవిడ్‌తో నాన్న గట్టిగా పోరాడుతున్నారు.

మీ ప్రార్థనలు ప్రేమ మమ్మల్ని రక్షిస్తాయి అని నమ్ముతున్నాము. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను కోరుతున్నాను. మీ ప్రేమతో, కరోనా నీ నాన్న జయిస్తారు. నాన్న పరిస్థితి క్రిటికల్ కాదు..నిలకడగానే ఉంది. ఆందోళన చెందొద్దు. ఫేక్ న్యూస్ ప్రచారం వయవద్దు' అని ట్వీట్ చేశారు.

Next Story
Share it