Telugu Gateway
Cinema

ఐసీయూలో రాజశేఖర్ కు చికిత్స

ఐసీయూలో రాజశేఖర్ కు చికిత్స
X

కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి సిటి న్యూరో ఆస్పత్రి మంగళవారం నాడు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇటీవల రాజశేఖర్ కు ఫ్లాస్మా థెరపి కూడా చేసినట్లు తెలిపారు. దీంతోపాటు సైటోసోర్బ్ పరికరం ద్వారా చికిత్స అందిస్తున్నారు.

రాజశేఖర్ క్లినికల్ కండిషన్ మెరుగ్గానే ఉందన్నారు. వైద్యానికి రాజశేఖర్ స్పందిస్తున్నారని, వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్ష్తిస్తుందని తెలిపారు. ఇటీవలే జీవిత రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్చి అయ్యారు.

Next Story
Share it