Telugu Gateway
Cinema

నానికి జోడీగా సాయిపల్లవి..కృతిశెట్టి

నానికి జోడీగా సాయిపల్లవి..కృతిశెట్టి
X

నాని కొత్త సినిమా ప్రారంభం అయింది. శ్యామ్ సింగరాయ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాని తండ్రి ఘంటా రాంబాబు క్లాప్‌ కొట్టి శ్రీకారం కొట్టారు. ఈ సినిమాలో నానికి జోడీగా కృతిశెట్టి, సాయిపల్లవి నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్‌ ఆన్ చేశారు. ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వంలో నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ ఎస్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేశారు.

Next Story
Share it