వీరమాస్ లుక్ లో నాని
BY Admin20 March 2022 6:30 AM GMT
X
Admin20 March 2022 6:30 AM GMT
హీరో నాని దసరా సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా వీరమాస్ లుక్ లో ఉన్న నాని న్యూలుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దసరాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడతోపాటు హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన నాని సినిమా శ్యామ్ సింగరాయ్ కు మిశ్రమ స్పందన వచ్చింది. అయినా ఇందులో శ్యామ్ సింగరాయ్ గా నటించిన నానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టిలు నటించిన విషయం తెలిసిందే.
Next Story