Telugu Gateway
Cinema

హాయ్ నాన్నా ఈవెంట్ లో వివాదం

హాయ్ నాన్నా ఈవెంట్ లో వివాదం
X

హీరో నాని వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కొత్త సినిమా హాయ్ నాన్న డిసెంబర్ ఏడున విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇటీవలే వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్క్రీన్ మీద విజయదేవరకొండ, రష్మిక మాల్దీవులు హాలిడేకు వెళ్లిన ఫోటో ప్రత్యక్షం అయింది. దీనిపై యాంకర్ సుమ అక్కడ ఉన్న ఒక ఫోటో గ్రాఫర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ నువ్వేనరా అప్పుడు అక్కడకు బాలికి వెళ్ళింది. నాకు అప్పుడే డౌట్. ఇలాంటి పిక్చర్ తీయవచ్చా. ఎంత సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్ అయితే మాత్రం..ప్రైవసీ ఉండదా అసలు..ఏది అంటే అది పెట్టడమే అంటూ కామెంట్ చేస్తారు. ఈ ఫోటో స్క్రీన్ పై వచ్చినప్పుడు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒకింత షాక్ కు గురవుతుంది. హీరో నాని కూడా ఇబ్బందిగా నవ్వుతూ కనిపిస్తారు. ఇక అంతే అటు హీరో విజయదేవరకొండ, ఇటు రష్మిక ఫాన్స్ హీరో నాని తో పాటు యాంకర్ సుమ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారా...ఒక సినిమా ఫంక్షన్ లో వేరే హీరో, హీరోయిన్ల ఫోటో లు ప్రదర్శించి వాటిపై కామెంట్స్ చేయటం సరికాదు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో ఈ వివాదంపై హీరో నాని స్పందించారు. ఇలాంటి ఘటన జరగటం నిజంగా దురదృష్టకరం..దీనివల్ల ఎవరైనా నిజంగా బాధపడి ఉంటే వాళ్లకు హాయ్ నాన్న టీం తరపున, తాను వ్యక్తిగతంగా క్షమాపణ చెపుతున్నట్లు ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ ప్రస్తావించారు. ఇది మూవీ ఈవెంట్ అని..గాసిప్స్ వెబ్ సైట్ కాదు..ఇలాంటి స్టంట్స్ వేయటానికి అంటూ స్పందించారు నాని. యాంకర్ సుమ తో పాటు తనకు కూడా అక్కడ ఏమీ జరిగిందో తెలియదు అన్నారు. అయితే సుమ మాటల వీడియో చూస్తే మాత్రం దాన్ని ఎవరూ నమ్మరు అని చెప్పొచ్చు. తాము ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అని..విజయ్, రష్మిక లు దీన్ని అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నట్లు నాని తెలిపారు. ఈ ఘటనపై విజయ్, రష్మికలు ఎక్కడా స్పందించ లేదు.

Next Story
Share it