Telugu Gateway
Cinema

హైదరాబాద్ లో ఫస్ట్ ఇదే !

హైదరాబాద్ లో ఫస్ట్ ఇదే !
X

టాలీవుడ్ హీరో నాగ చైతన్య గ్యారేజ్ లోకి మరో ఖరీదు అయిన కారు వచ్చింది. అదే మూడున్నర కోట్ల రూపాయల ఖరీదు అయిన పోర్స్చే కారు. ఇటీవలే నాగ చైత్యన ఈ కారు కొనుగోలు చేశారు. ఈ సిల్వర్ పోర్స్చే 911 జీటి 3 పక్కన నిలబడి ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. భారత్ లో ఈ కారు షో రూమ్ ధర 3 .51 కోట్ల రూపాలుగా ఉంది.

ఈ కారు రిజిస్ట్రేషన్ మే 17 న జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ లో తొలి పోర్స్చే 911 జీటి ఇదేనని చెపుతున్నారు. పోర్స్చే చెన్నై సెంటర్ ఈ ఫోటో లను విడుదల చేసింది. ఇప్పటికే నాగ చైతన్య దగ్గర మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్, ఫెరారీ తదితర కార్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నాగ చైతన్య ఇప్పుడు తండేల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నాగ చైతన్యకు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది.

Next Story
Share it