Telugu Gateway
Cinema

సితార సంచలన ప్రకటన

సితార సంచలన ప్రకటన
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార కీలక ప్రకటన చేసింది. తనకు నటన అంటే ఎంతో ఇష్టమని...తాను సినిమాల్లో నటిస్తాను అని స్పష్టం చేసింది. ఇప్పటికి సితార మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమాలోని సాంగ్ ప్రమోషన్ కోసం నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఒక నగల సంస్థ యాడ్ లో నటించింది. అంతే కాదు..ఈ యాడ్ ఏకంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించటంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. సినిమాల విషయానికి సంబంధించి ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. శనివారం నాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సితార తన అభిప్రాయాన్ని వెల్లడించింది. నగల యాడ్ చేయటం కూడా ఎంతో సంతోషంగా ఉంది అని..షూటింగ్ కూడా సరదాగా సాగిపోయింది అని తెలిపింది. ఈ యాడ్ చేయగా వచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ సేవ కార్యక్రమాలకు ఇచ్చినట్లు సితార తెలిపింది.

మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఒక్కప్పటి హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.సితార సినిమాల ఆసక్తిపై ఆమె స్పందిస్తూ సరైన దారిచూపేవాళ్లు, మంచి మనుషుల సపోర్ట్ ఉంటే సినిమా పరిశ్రమ ఎంతో అందమైన ప్రదేశం అన్నారు. కాకపోతే ఎక్కువమందికి దీనిపై సదభిప్రాయం లేదు అని వెల్లడించారు. తమ పిల్లలు నచ్చిన రంగాలను ఎంచుకునే స్వేచ్ఛ తాము ఇస్తామన్నారు. గౌతమ్ సినీ ఎంట్రీ పై మాట్లాడుతూ తన వయసు ఇప్పుడు పదహారు సంవత్సరాలే అని..గౌతమ్ సినిమాల్లోకి రావటానికి ఎనిమిదేళ్లు పట్టొచ్చు అన్నారు. సితార ఇప్పుడు పీఎంజె జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ కంపెనీ సితారపై ‘ప్రిన్సెస్’ పేరుతో ఓ పార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ కార్యక్రమానికి నమ్రతతో పాటు సితార కూడా హాజరైన సమయంలోనే సినీ ఎంట్రీపై స్పందించింది సితార.

Next Story
Share it