Telugu Gateway
Cinema

వేడుక‌గా కార్తికేయ వివాహం

వేడుక‌గా కార్తికేయ వివాహం
X

టాలీవుడ్ సెల‌బ్రిటీల మ‌ధ్య యువ హీరో కార్తికేయ వివాహం ఆదివారం నాడు హైద‌రాబాద్ లో జ‌రిగింది. తన ప్రియురాలు లొహితా రెడ్డిని కార్తికేయ‌ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడ‌య్యాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌ జరిగిన ఈ వివాహ వేడుకకి మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తణికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కార్తికేయ వరంగల్‌ లో ఎన్ఐటి విద్యార్థిగా ఉన్నప్పడు లొహితతో పరిచయం ఏర్పడింది. 2012లో ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వ‌చ్చి మాట్లాడ‌తాన‌ని చెప్పాడు. హీరో అవ్వ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికీ అంతే క‌ష్ట‌ప‌డ్డాడు. ఫైన‌ల్‌గా హీరోగా నిల‌దొక్కుకున్నాక పెద్ద‌ల‌ను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

Next Story
Share it