Telugu Gateway
Cinema

'పూన‌కాలు లోడింగ్ ' అంటున్న చిరంజీవి

పూన‌కాలు లోడింగ్  అంటున్న చిరంజీవి
X

మైత్రీ మూవీ మేక‌ర్స్ చిరంజీవి హీరోగా సినిమాను ప్ర‌క‌టించింది. కె ఎస్ ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు సంబంధించిన లుక్ ను చిరంజీవి పుట్టిన సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. అందులో చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ పూన‌కాలు లోడింగ్ అంటూ రాశారు. ఓ నాటు ప‌డ‌వ‌పై చిరంజీవి పూర్తి మాస్ లుక్ లో లంగ‌రు ప‌ట్టుకుని క‌న్పిస్తారు. ఇది చిరంజీవి 154వ సినిమా. దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది తెలిపారు. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే చిరంజీవికి సంబంధించి ఏకంగా మూడు కొత్త సినిమాల అప్ డేట్స్ రావ‌టంతో ఆయ‌న అభిమానులు ఫుల్ కుషీలో ఉన్నారు. 154వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ప్ర‌చారం. ఈ సినిమాలో చిరంజీవి సరసన సోనాక్షి సిన్హా పేరును పరిశీలిస్తున్నారు.

Next Story
Share it