జనని రోల్ కోసం బాలీవుడ్ నుంచి..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 లో ఇప్పుడు మరో నటి చేరింది. బాలీవుడ్ మూవీ ‘బజరంగీ భాయిజాన్’లో మున్నీ పాత్రలో నటించిన హర్షాలి మల్హోత్రా అఖండ 2 లో సందడి చేయనుంది . ఈ విషయాన్నీ చెపుతూ చిత్ర యూనిట్ బుధవారం నాడు అమె లుక్ ను విడుదల చేసింది. అఖండ 2 తాండవంలో అమె జనని పాత్ర లో కనిపించనుంది అని వెల్లడించారు. హర్షాలి మల్హోత్రా బాలనటిగా ఎంట్రీ ఇచ్చి హిందీ లో పలు సీరియల్స్ లో నటించారు. అమె కు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా అంటే బజరంగీ భాయిజాన్ అనే చెప్పాలి. ఇప్పుడు బాలకృష్ణ అఖండ 2 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా దసరా సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తో పాటు సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల విడుదల అఖండ 2 టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కింది. యూట్యూబ్ లో ఇది రికార్డు లు కూడా క్రియేట్ చేసింది.