Telugu Gateway
Cinema

ఉస్తాద్ భగత్ సింగ్ అప్ డేట్

ఉస్తాద్ భగత్ సింగ్  అప్ డేట్
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తన పెండింగ్ సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఓజీ షూటింగ్ పూర్తి చేసేశారు...ఈ సినిమా దసరా సెలవుల సందర్బంగా సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కు సంబంధించిన మరో కీలక అప్ డేట్ వచ్చింది. అదేంటి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా క్లైమాక్స్ కూడా పూర్తి అయిపొయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ కు జోడిగా శ్రీ లీల, రాశీ ఖన్నాలు నటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు చిత్ర యూనిట్ దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ లతో కూడిన ఫోటో విడుదల చేస్తూ ఎన్నో భావోద్వేగాలతో కూడిన క్లైమాక్స్ ను విజయవవంతంగా పూర్తి చేశామని...నాభ కాంతా మాస్టర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది అని వెల్లడించారు. ఒక వైపు అధికారిక పనుల్లో బిజీగా ఉంటూ కూడా ఆయన సినిమా షూటింగ్ లో అంకిత భావంతో పాల్గొన్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో సినిమా కావటంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 24 న విడుదల అయిన పవన్ కళ్యాణ్ సినిమా హరి హర వీర మల్లు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకుల ఆకట్టుకోవడంలో విఫలం అయింది అనే చెప్పాలి.

ఈ మూవీ బాగానే ఉన్నా కూడా సోషల్ మీడియా లో దీనిపై జరిగిన నెగిటివ్ ప్రచారం కలెక్షన్స్ పై బాగానే ప్రభావం చూపించింది. వీకెండ్స్ లో కూడా థియేటర్లు ఫుల్ కాలేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మొదటి నుంచి ఈ మూవీ పై ప్రతికూల ప్రచారమే ఎక్కువ సాగింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. వీటికి తోడు ఈ సినిమా టికెట్ రేట్లను పెంచటం కూడా ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించకపోవటానికి గల కారణాల్లో మరొకటి అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరికి కళ్ళు వచ్చే నెలలో విడుదల కానున్న ఓజీ మూవీపైనే ఉన్నాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కూడా ఈ ఏడాది చివరిలో ఉంటుందా..లేక వచ్చే ఏడాదా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

Next Story
Share it