నిరీక్షణ ముగిసింది
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు హరి హర వీర మల్లు టీజర్ విడుదల అయింది. దీంతో గత కొంత కాలంగా ఈ సినిమా ఆగిపోయింది అని సాగుతున్న పుకార్లకు కూడా చెక్ పెట్టినట్టినట్లు అయింది. మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పష్టత ఇచ్చారు మేకర్స్. తొలి భాగం హరి హర వీర మల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ 2024 లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ దోపిడీకి గురయ్యే ప్రజల పక్షాన పోరాడే యోధుడిగా చూపిస్తారు. టాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపిస్తారు. హరి హర వీర మల్లు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా అనే చెప్పొచ్చు. ఈ మూవీ తెలుగు తో పాటు హిందీ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తుంటే...ఏ ఎం రత్నం ఈ సినిమా నిర్మాత.