Telugu Gateway
Cinema

పెండింగ్ సినిమాలు ఇక వరసగా ప్రేక్షకుల ముందుకు!

పెండింగ్ సినిమాలు ఇక వరసగా ప్రేక్షకుల ముందుకు!
X

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీ వచ్చేసింది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినందున ఈ సారి మాత్రం విడుదల పక్కా అని ఫిక్స్ అయిపోవొచ్చు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల అవుతున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం. తొలుత ఈ సినిమాకు దర్శకుడు జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించారు. తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావటంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలు తప్పింది. విపరీతమైన జాప్యం జరిగింది. దీంతో క్రిష్ ఈ సినిమా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నారు.

క్రిష్ తెరకెక్కించిన భాగం పోను మిగిలిన సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటించింది. హరిహర వీరమల్లు సినిమాను స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల చేయనున్నారు. ధర్మం కోసం యుద్ధం అంటూ జూన్ 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న హరిహర వీరమల్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డు లు నమోదు చేస్తుందో చూడాలి. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాలకు సమయంలో కేటాయిస్తూ ఎప్పటి నుంచో ఆగిపోయిన సినిమా షూటింగ్ లను పూర్తి చేస్తున్నారు. అందులో తొలి ప్రాధాన్యత హరిహర వీరమల్లు కు ఇచ్చారు. దీని తర్వాత ఓజీ సినిమా షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఓజీ కూడా కూడా పూర్తి అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు పవన్ కళ్యాణ్ సమయం కేటాయిస్తారు అని చెపుతున్నారు. దీంతో పెండింగ్ లో పడిపోయిన సినిమాలు అన్ని ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు.

Next Story
Share it