సమ్మర్ కు 'హరిహర వీరమల్లు' సందడి
BY Admin2 Sep 2021 10:55 AM GMT
X
Admin2 Sep 2021 10:56 AM GMT
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గురువారం నాడు పండగే పండగ. ఆయన సినిమాలకు సంబంధించి పలు అప్ డేట్స్ వచ్చాయి. తొలుత బీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ విడుదల చేయగా..ఆ తర్వాత 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్ తో వెల్లడించింది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాకు కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.
Next Story