వేసవిలో పవన్ ఎంట్రీ
పవన్ కళ్యాణ్ సినిమా విడుదల మరో సారి వాయిదా పడింది. ముందు ప్రకటించిన తేదీ ప్రకారం అయితే ఆయన హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా మార్చి 28 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఎప్పుడైతే మ్యాడ్ 2 సినిమాతోపాటు నితిన్, శ్రీ లీల జంటగా నటించిన రాబిన్ హుడ్ సినిమా లు ఈ డేట్ లాక్ చేసుకున్నాయో అప్పుడే పవన్ సినిమా వాయిదా పడింది అనే సంకేతాలు వచ్చేశాయి. అయితే హోలీ రోజు చిత్ర యూనిట్ అధికారికంగా కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మే 9 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా ఇందులో విపరీత జాప్యం జరుగుతుండటంతో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. క్రిష్ తెరకెక్కించగా మిగిలిన పార్ట్ ను నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. కొత్త విడుదల తేదీతో న్యూ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.