కరోనా నుంచి కోలుకున్న ఎన్టీఆర్
BY Admin25 May 2021 10:30 AM IST
X
Admin25 May 2021 10:30 AM IST
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినట్లు ఆయన మంగళవారం నాడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ అభినందనలు తెలిపిన ఎన్టీఆర్..డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, తన కజిన్. కిమ్స్ డాక్టర్ డాక్టర్ వీరు లు అందించిన సేవలు తాను త్వరగా కరోనా నుంచి కోలుకోవటానికి ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.
కోవిడ్ 19ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని..మంచి జాగ్రత్తలు..సానుకూల ఆలోచనలు ఉంటే దీన్నుంచి బయటపడొచ్చని తెలిపారు. మానసిక స్థ్యైర్యం ఎంతో కీలకం అని..ఇది కరోనాను ఎదుర్కొనే పెద్ద ఆయుధం అని పేర్కొన్నారు. ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉంటూ..మాస్క్ లు ధరించాలని కోరారు.
Next Story