Telugu Gateway
Cinema

కొరటాల సినిమా..ఎన్టీఆర్ న్యూలుక్

కొరటాల సినిమా..ఎన్టీఆర్ న్యూలుక్
X

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఇప్పటికే కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ముగిసిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇది ఎన్టీఆర్ 30 సినిమా. గురువారం ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఓ లుక్ ను విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో కొరటాల శివ, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారెజ్' సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే కొత్త సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it